✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › ఏ పాపమెరుగని | E Paapamerugani Lyrics

ఏ పాపమెరుగని | E Paapamerugani Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
E Paapamerugani Lyrics in Telugu

ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొరకీ పాట్లు నొందినావా

ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా

ఏ పాప

కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా
సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా

ఏ పాప

చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి – కడ కేగి సిలువను – గ్రక్కున దించినావా

ఏ పాప

ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు చేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా

ఏ పాప

పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా

ఏ పాప

బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లిబడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము

ఏ పాప

కట కటా పాప సంకటము బాపుటకింత – పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామీ

ఏ పాప


E Paapamerugani Lyrics in English

Ye paapamerugani yo paavana moorti, paapa vimochinchaka
Naa paali Daivamaa, naa paapamula koraki paatlu nondinaavaa

Mullatho kireeta – malli nee shiramupai – jallaṭamuna mottiraa
Mulla potlaku shiramu – talladillaga somma – sillipotiva rakshakaa

E Paapa

Kaluvari giri danuka – siluva moyaleka – kalavaramu nondinaavaa
Siluva neetho moya – tuluvulu verokani – thodugaa nichchinaaraa

E Paapa

Chedagu Yoodulu bettu – padaraani paatlaku – sudivadi nadachinaavaa
Kadaku Kalvari giri – kada kegi siluvanu – grakkuna dinchinaavaa

E Paapa

Aa kaala karmulu – bheekarambuga ninnu – aa koyyapai nunchiraa
Nee kaalu chetulu – aa koyyake soodi – mekulatho gruchchinaaraa

E Paapa

Paluvidhambula shramalu – chelarega dandrikī – nelugetthi moraliditiva
Siluva pai palumaaru – kaluguchundedi baadha – valana daahamu naayenaa

E Paapa

Ballidundagu bantu – ballemuna nee prakka – jillibada bodachinaadaa
Ullolamulavale nalla neerubukanga jallaare gada kopamu

E Paapa

Kata kataa paapa sankatamu baaputakinta – patu baadha nondinaavaa
Etuvantidi prema – yetuvantidi shaanta – metula varnintu swaamee

E Paapa

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.