✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › Aparadhini Yesayya | అపరాధిని యేసయ్యా | Telugu Chrisitan Song Lyrics

Aparadhini Yesayya | అపరాధిని యేసయ్యా | Telugu Chrisitan Song Lyrics

▣ Oct 12, 2026
♫ Lyrics
Aparadhini Yesayya telugu  song lyrics :
అపరాధిని యేసయ్య-కృపజూ పి భ్రోవుమయ్యా,
నెపమెంచకయె నీ కృప లో - నపరాధములను క్షమించు
సిలువకు నిను నే గొట్టితిని - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా   " అప "
ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితివయ్యో           " అప "
ముళ్ళతో కిరీటంబు నల్లీ నీ - శిరమున నిడితి
నావల్ల నేరమాయె - చల్లనిదయగల తండ్రీ                 " అప "
దాహంబు గొనగా చేదు చిరకను - ద్రావనిడితి
ద్రోహుండ నై జేసితి నీ - దేహంబు గాయంబులను     " అప "
ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్రూరుండనై గొట్టితిని - ఘోరంపు పాపిని దేవా     " అప "
చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బల చేత
నిందలు పెట్టితినయ్యో - సందేహమేలనయ్యా      " అప "
రక్షణ దెచ్చితివయ్యా - శిక్షకు పాత్రుడ నయ్యా
అక్షయభాగ్యమునియ్య- మోక్షంబుజూపితి వయ్యా    " అప "
aparaadhini yaesayya-kRpajoo pi bhrOvumayyaa,
nepameMchakaye nee kRpa lO - naparaadhamulanu kshamiMchu
siluvaku ninu nae goTTitini - tuluvalatO jaeritini
kalushaMbulanu mOpitini - dOshuMDa naenu prabhuvaa   " apa "
prakkalO ballepupOTu grakkuna poDichiti naenae
mikkili baadhiMchitini - makkuva joopitivayyO           " apa "
muLLatO kireeTaMbu nallee nee - Siramuna niDiti
naavalla naeramaaye - challanidayagala taMDree                 " apa "
daahaMbu gonagaa chaedu chirakanu - draavaniDiti
drOhuMDa nai jaesiti nee - daehaMbu gaayaMbulanu     " apa "
ghOraMbugaa dooritini - naeraMbulanu jaesitini
krooruMDanai goTTitini - ghOraMpu paapini daevaa     " apa "
chiMditi raktamu naakai - poMdina debbala chaeta
niMdalu peTTitinayyO - saMdaehamaelanayyaa      " apa "
rakshaNa dechchitivayyaa - Sikshaku paatruDa nayyaa
akshayabhaagyamuniyya- mOkshaMbujoopiti vayyaa    " apa "

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.